Skip to Content

ప్రాప్యత

Los Angeles కౌంటీ (కౌంటీ) తన వెబ్‌సైట్ (వెబ్‌సైట్)లో ఉన్న సమాచారం యొక్క సార్వత్రిక ప్రాప్యతకు కట్టుబడి ఉంది. వెబ్‌సైట్ యొక్క రూపకల్పన విస్తృతంగా చదవగలిగి మరియు వినియోగాన్ని నిర్ధారించడానికి అనుకూలపరచబడినది, ఇందులో వైకల్యతలు ఉన్నవారికి ప్రాప్యతా ప్రమాణాలు మరియు విశేషతలు (ఫీచర్లు) ఉంటాయి, తద్వారా వారు వెబ్‌సైట్‌ను చూడగలరు, అర్థం చేసుకోగలరు, నావిగేట్ చేయగలరు, సంభాషించగలరు మరియు వెబ్‌సైట్‌కు సమర్థవంతంగా దోహదపడగలరు.

వెబ్‌సైట్ ప్రస్తుతం కొత్త మరియు పాత సాంకేతికతలు, కొత్త మరియు ఇప్పటికే ఉన్న విషయాల కలయిక. వెబ్‌సైట్ హోమ్ పేజీ మరియు సహాయక వెబ్ పేజీలు United States రిహాబిలిటేషన్ యాక్ట్ 1973 యొక్క సెక్షన్ 508, సవరించబడిన విధంగా, మరియు అమెరికన్స్ విత్ డిజాబిలిటీస్ యాక్ట్ (కూడిన, మార్గదర్శకాలు)కు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఈ వెబ్‌సైట్‌లో విభాగపరమైన (డిపార్ట్‌మెంటల్), ఏజెన్సీ మరియు మూడవ పార్టీ వెబ్‌సైట్‌లు మార్గదర్శకాలకు అనుగుణంగా లేని విశేషతలకు (ఫీచర్లు) లింక్‌లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న కొన్ని విషయాలు కనీస సమ్మతి ప్రమాణాలకు మాత్రమే అనుగుణంగా ఉండవచ్చు. విభాగాలు మరియు ఇతరులు తమ ప్రస్తుత వెబ్‌సైట్‌లను అప్‌డేట్ చేయడం మరియు ఆమోదయోగ్యమైన సమ్మతి స్థాయిలను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి ప్రయత్నాలను కొనసాగించడం ద్వారా ఇది పరిష్కరించబడుతుంది. అయితే, ఇందులో కౌంటీ నిర్వహించని లేదా నియంత్రించని మూడవ పార్టీ సాఫ్ట్‌వేర్/టూల్స్, సెర్చ్ ఇంజిన్లు (వెతికే యంత్రాలు), విడ్జెట్స్, యాడ్ ఇన్‌లు, APIలు మొదలైనవి ఉండకపోవచ్చు.

క్యాస్కేడింగ్ (క్రమంలో అమర్చిన) స్టైల్ షీట్స్ (CSS)

పోర్టల్ వెబ్ పేజీలు శీర్షికలు మరియు బాడీ టెక్స్ట్ యొక్క స్థిరమైన, ఏకరీతి రూపాన్ని అనుమతించే స్టైల్ షీట్లతో రూపొందించబడ్డాయి. ఈ డిజైన్ ఫీచర్ పోర్టల్ స్టైల్ షీట్లను కొన్ని బ్రౌజర్ల స్వంత స్టైల్ షీట్లతో అధిగమించడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా దృష్టి లోపం ఉన్నవారు సులభంగా వీక్షించే విషయాలను అందిస్తుంది.

కలర్ కాంట్రాస్ట్

పోర్టల్ వెబ్ పేజీల బ్యాక్ గ్రౌండ్ మరియు ఫోర్ గ్రౌండ్ (ముందు భాగం) రంగులను చూడలేని వారెవరైనా వీక్షించడానికి తగినంత కాంట్రాస్ట్‌ను అందిస్తాయి.

Icon - Close