భాషా ప్రాప్యత సలహా కమిటీ
భాషా ప్రాప్యత సలహా కమిటీ (Language Accessibility Advisory Committee – LAAC) 2017లో స్థాపించబడింది. ఎన్నికలు మరియు ఎన్నికలకు సంబంధించిన సమాచార సామగ్రి భాషాపరంగా అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, ఆంగ్ల భాషలో పరిమిత ప్రావీణ్యం కలిగిన ఓటర్లకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన కార్యక్రమాలు మరియు వ్యూహాల అమలుకు సంబంధించిన అంశాల్లో రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లర్క్‌కు సలహాలు, సూచనలు అందించడం ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.
బాధ్యతలు
- LAAC త్రైమాసిక సమావేశాలకు హాజరు కావడం. ఈ సమావేశాల్లో టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అయితే, పాల్గొనేవారు కనీసం సగం సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కావాలని గట్టిగా ప్రోత్సహించబడుతున్నారు
- ఓటు కేంద్రాల్లో భాషాపరమైన ప్రాప్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సలహాలు, సూచనలు అందించడం
- భాషా ప్రాప్యతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు మరియు ప్రచార కార్యక్రమాలను ప్రోత్సహించడం
- ఓటు కేంద్రాల్లో అందించే బహుభాషా సేవలపై సర్వే నిర్వహించడంలో సహకరించడం
- ఓటు కేంద్రాల్లో పనిచేసే ద్విభాషా సిబ్బందికి అందించే శిక్షణకు సంబంధించి సిఫార్సులు చేయడం
- గుర్తించిన భాషల్లో రూపొందించిన ఎన్నికల సమాచార సామగ్రిని సమీక్షించడంలో భాషాపరమైన నైపుణ్యం, సలహాలు అందించడం
సభ్యత్వం
కమిటీ సభ్యుల వివరాలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
- Asian American Advancing Justice – Los Angeles
- CA Common Cause
- CAUSE
- CHIRLA
- City Clerk of Glendale
- City Clerk of Pasadena
- City Clerk of Sierra Madre
- City of Bellflower
- City of West Hollywood
- Deputy Mayor of City of Bell
- FarsiVote
- Khmer Girls in Action
- Korean American Coalition
- L.A. City
- LWV, Los Angeles
- NALEO
- NIAC (National Iranian American Council)
- Pars Equality Center
- South Asian Network
- South Asian Network (SAN)
- Thai CDC
- UCP
మీరు సలహా కమిటీ సభ్యులుగా చేరడానికి ఆసక్తి కలిగి ఉంటే, దయచేసి కింది వివరాల ద్వారా సంప్రదించండి:
ప్రత్యేక సేవలు మరియు ప్రజా అవగాహన విభాగం
ఫోన్: (562) 462-2118
ఇమెయిల్: SpecialServicesOutreach@rrcc.lacounty.gov
Department of Registrar-Recorder/County Clerk
12400 Imperial Highway, Room 6205
Norwalk, CA 90650
భాషా ప్రాప్యత సలహా కమిటీ నియమావళి