Skip to Content

అదనపు సమాచారం

ఓటరు నమోదు అఫిడవిట్‌ను పూర్తి చేసే ఉద్దేశంతో ఓటరు అందించే వ్యక్తిగత సమాచారాన్ని ఏయే అనుమతించబడిన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చో ఆ ఓటరుకు పూర్తిగా తెలియజేయాలన్నది శాసనసభ ఉద్దేశం. (ELEC § 2157.1 చూడండి)

మీ ఓటరు నమోదు అఫిడవిట్‌లోని సమాచారాన్ని, ఓటింగ్ కేంద్రాల స్థానాలు, బ్యాలెట్‌పై ఉండే అంశాలు మరియు అభ్యర్థుల వివరాలు వంటి ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీకు పంపడానికి ఎన్నికల అధికారులు ఉపయోగిస్తారు. ఓటరు నమోదు సమాచారాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టప్రకారం నిషేధించబడింది మరియు అది ఒక నేరం. రాష్ట్ర కార్యదర్శి నిర్ణయించిన మేరకు, ఎన్నికల, విద్యాపరమైన పరిశోధన, పాత్రికేయ, రాజకీయ లేదా ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాల కోసం ఓటరు సమాచారాన్ని ఎన్నికల పదవికి పోటీ చేసే అభ్యర్థికి, డ్రాఫ్ట్ చట్టాలకు సంబంధించిన కమిటీకి లేదా ఇతర వ్యక్తులకు అందించవచ్చు. అయితే, ఈ ప్రయోజనాల కోసం మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, సామాజిక భద్రతా నంబర్ (Social Security Number) లేదా మీ ఓటరు నమోదు కార్డుపై ఉన్న మీ సంతకాన్ని వెల్లడించరాదు. ఓటరు సమాచార వినియోగం గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా లేదా అటువంటి సమాచారం దుర్వినియోగం అవుతోందని మీరు అనుమానించి నివేదించాలనుకున్నా, దయచేసి రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి చెందిన ఓటరు రక్షణ మరియు సహాయ హాట్‌లైన్‌కు (800) 345-VOTE నంబరుకు ఫోన్ చేయండి.

ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్న కొంతమంది ఓటర్లు తమ ఓటరు సమాచారాన్ని గోప్యంగా ఉంచే ప్రత్యేక హోదాకు అర్హులు కావచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి రాష్ట్ర కార్యదర్శి కార్యాలయానికి చెందిన సేఫ్ ఎట్ హోమ్ (Safe at Home) కార్యక్రమాన్ని సంప్రదించండి. (ELEC § 2157.2 చూడండి)

 
Icon - Close