Skip to Content

ఇన్-పర్సన్ (స్వయంగా వచ్చి) ఓటింగ్

Vote In Person

ఓటు సెంటర్ సమాచారం

Los Angeles కౌంటీలోని ఓటర్లు రాబోయే ఎలక్షన్లో పాల్గొనే ఓటు సెంటర్లో తమ బ్యాలెట్‌ను ఇన్-పర్సన్ (స్వయంగా వచ్చి) క్యాస్ట్ చేసే అవకాశం ఉంది.

ఓటింగ్‌ను సురక్షితంగా, సులభంగా మరియు సౌకర్యవంతంగా చేయడానికి ఓటు సెంటర్లు ఆధునిక ఫీచర్‌లను అందిస్తాయి. ఓటు సెంటర్లు మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటు డ్రాప్ బాక్స్ లొకేషన్లుగా కూడా పనిచేస్తాయి - వేచి ఉండాల్సిన అవసరం లేదు, మీ బ్యాలెట్‌ను (పూర్తి చేసిన) ఓటు సెంటరు ముందు భాగంలో డ్రాప్ ఆఫ్ చేయండి.


సురక్షితమైన ఇన్-పర్సన్ (స్వయంగా వచ్చి) ఓటింగ్

మీ ఆరోగ్యం మరియు భద్రత మా ప్రాధాన్యత. ఓటు సెంటర్లు COVID-19కి సంబంధించిన ప్రజారోగ్య మరియు భద్రతా మార్గదర్శకాలను అనుసరిస్తాయి, అవి:

 • ఓటర్లను లైన్‌లో ఉన్నప్పుడు లేదా ఓటు వేసేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలని గట్టిగా ప్రోత్సహించబడతారు
 • ప్రతి ఓటరు తరువాత అన్ని ఉపరితలాలు మరియు బ్యాలెట్ మార్కింగ్ పరికరాలను తుడవడం మరియు శుభ్రపరచడం
 • సోషల్ డిస్టెన్సింగ్

సురక్షితమైన ఎలక్షన్ ప్రణాళిక

ఓటు సెంటర్లో మీ చెక్-ఇన్‌ను వేగవంతం చేసుకోండి

మీ త్వరిత చెక్-ఇన్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓటు సెంటర్లో చెక్ ఇన్ చేసే సమయాన్ని తగ్గించుకోండి.

మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసిన తరువాత మీ రిజిస్ట్రేషన్ సమాచారం క్రింద మీ ప్రత్యేకమైన చెక్-ఇన్ కోడ్ (బార్‌కోడ్) కనిపిస్తుంది. తక్షణమే చెక్ ఇన్ చేయడానికి ఓటు సెంటర్లో ఉన్నప్పుడు మీ కోడ్‌ను ఎలక్షన్ వర్కరుకు చూపించండి.

మీ త్వరిత చెక్-ఇన్ కోడ్ మీకు మెయిల్ చేయబడిన శాంపిల్ బ్యాలెట్ మరియు ఓటు సెంటర్ పోస్ట్‌కార్డులో కూడా ప్రింట్ చేయబడుదుతుంది. మీరు ఆ హార్డ్ కాపీలలో దేనినైనా ఓటు సెంటరుకు తీసుకెళ్లవచ్చు.

Norwalk ప్రధాన కార్యాలయంలో ముందస్తు ఓటింగ్

Norwalk ప్రధాన కార్యాలయం ప్రతి ఎలెక్షనుకు 29 రోజుల ముందు ముందస్తు ఓటింగ్ కొరకు అందుబాటులో ఉంటుంది. ఓటర్లు ఇన్-పర్సన్ (స్వయంగా వచ్చి) ఓటు వేయడానికి ఎంచుకోవచ్చు లేదా భవనం యొక్క ఉత్తరం వైపున (Imperial Highwayకి ఎదురుగా) బ్యాలెట్ డ్రాప్ బాక్సులో పూర్తి చేసిన బ్యాలెట్‌ను డ్రాప్ ఆఫ్ చేయవచ్చు.

Norwalk ప్రధాన కార్యాలయం

12400 Imperial Highway, Room 3201
Norwalk, CA 90650

ఎలక్షన్ ప్రచారం నిషేధించబడింది!

ఉల్లంఘనలు జరిమానాలు మరియు/లేదా జైలు శిక్షకు దారి తీయవచ్చు.

ఎక్కడ:

 • ఒక వ్యక్తి బ్యాలెట్ వేయడానికి లైనులో ఉన్నప్పుడు వారికి సమీపంలో లేదా పోలింగ్ స్థలం యొక్క ప్రవేశ ద్వారం, సైడ్ వాక్ ఓటింగ్ లేదా డ్రాప్ బాక్స్ నుండి 100 అడుగులలోపు క్రింద పేర్కొన్న కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.

ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి:

 • ఒక వ్యక్తిని ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని అడగవద్దు.
 • అభ్యర్థి పేరు, ఫోటో లేదా లోగోను ప్రదర్శించవద్దు.
 • ఏ బ్యాలెట్ డ్రాప్ బాక్సులకైనా యాక్సెస్‌ (ప్రాప్యత)ను నిరోధించడం లేదా దగ్గరలో సంచరించడం వంటివి చేయవద్దు.
 • ఏదైనా పోలింగ్ స్థలం, ఓటు సెంటర్ లేదా బ్యాలెట్ డ్రాప్ బాక్స్ సమీపంలో ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎటువంటి సామాగ్రి లేదా వినగల సమాచారాన్ని అందించవద్దు.
 • చొరవలు, ప్రజాభిప్రాయ సేకరణలు, తొలగింపు లేదా అభ్యర్థుల నామినేషన్లతో సహా ఎలాంటి పిటీషనుల పంపిణీ చేయవద్దు.
 • అభ్యర్థి పేరు, ఫోటో, లోగో మరియు/లేదా ఏ అభ్యర్థికి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి మద్దతుగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి దుస్తులను (టోపీలు, చొక్కాలు, గుర్తులు, బటన్లు, స్టిక్కర్లు) పంపిణీచేయడం, ప్రదర్శించడం లేదా ధరించడం చేయవద్దు.
 • ఓటు వేయడానికి ఓటరు అర్హతల సమాచారాన్ని ప్రదర్శించడం లేదా ఓటరుతో మాట్లాడటం చేయవద్దు.
 • పైన సంక్షిప్తీకరించబడిన ఎలక్షన్ నిషేధాలు California ఎలక్షన్స్ నియమావళి ఆర్టికల్ 7లోని 18వ విభాగం యొక్క 4వ అధ్యాయంలో నిర్ధేశించబడ్డాయి.

ఓటింగ్ ప్రక్రియలో అవినీతి నిషేధించబడింది!

ఉల్లంఘనలు జరిమానా మరియు/లేదా జైలు శిక్షకు లోబడి ఉంటాయి.

ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి:

 • ఎలక్షనులో మోసానికి పాల్పడవద్దు లేదా ప్రయత్నించవద్దు.
 • ఒక వ్యక్తికి ఓటు వేయడానికి లేదా ఓటు వేయకుండా ఉండటానికి, ఏ పద్ధతిలోనైనా లేదా ఏ విధంగానైనా ప్రేరేపించడానికి లేదా ప్రేరేపించేందుకు ప్రయత్నించడానికి ఎలాంటి పరిహారం లేదా లంచం అందించటం చేయవద్దు.
 • చట్టవిరుద్ధంగా ఓటు వేయవద్దు.
 • ఓటు వేసే అర్హత లేనప్పుడు ఓటు వేయడానికి ప్రయత్నించడం లేదా మరొకరికి ఓటు వేయడంలో సహాయం చేయడం లాంటివి చేయవద్దు.
 • ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం; ఒక ఓటరు పోలింగ్ స్థలంలోకి ప్రవేశించడం లేదా నిష్క్రమించేటప్పుడు ఫోటోతీయడం లేదా రికార్డు చేయడం; లేదా ప్రవేశించడం, బయటికి వెళ్లడం లేదా పార్కింగ్‌ను అడ్డుకోవడం వంటివి చేయవద్దు.
 • ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కును సవాలు చేయడం లేదా ఓటర్లు ఓటు వేయకుండా నిరోధించడం; ఓటింగ్ ప్రక్రియను ఆలస్యంచేయడం; లేదా మోసపూరితంగా ఏ వ్యక్తికైనా అతనికి లేదా ఆమెకు ఓటు వేసే అర్హత లేదని లేదా ఓటు వేయడానికి నమోదు చేసుకోలేదని సలహా ఇవ్వడం వంటివి చేయరాదు.
 • ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు.
 • కొన్ని మినహాయింపులతో, పోలింగ్ స్థలానికి సమీపంలో తుపాకీని కలిగి ఉండడం లేదా ఎవరికైనా తుపాకీని కలిగి ఉండేలా ఏర్పాట్లు చేయవద్దు.
 • కొన్ని మినహాయింపులతో, పోలింగ్ స్థలానికి సమీపంలో శాంతి అధికారి, గార్డు లేదా భద్రతా సిబ్బంది యూనిఫారంలో కనిపించడం లేదా ఎవరైనా కనిపించేలా ఏర్పాట్లు చేయడం వంటివి చేయవద్దు.
 • ఓటింగ్ సిస్టమ్ లోని ఏ భాగాన్నైనా ట్యాంపర్ (తారుమారు) చేయడం లేదా అంతరాయం కలిగించవద్దు.
 • బ్యాలెట్ల వాపసును ఫోర్జరీ చేయడం, అబద్ధీకరించడం లేదా ట్యాంపర్ (తారుమారు) చేయవద్దు.
 • బ్యాలెట్ల వాపసును మార్చవద్దు.
 • ఏదైనా పోలింగ్ జాబితా, అధికారిక బ్యాలెట్ లేదా బ్యాలెట్ కంటైనరును ట్యాంపర్ (తారుమారు), నాశనం లేదా మార్చడం చేయవద్దు.
 • అధికారిక కలెక్షన్ బాక్స్ అని విశ్వసించేలా ఓటరును మోసగించే ఏదైనా అనధికారిక బ్యాలెట్ కలెక్షన్ కంటైనరును ప్రదర్శించవద్దు.
 • పోల్ అయిన ఓట్ల ఫలితాల కాపీని ట్యాంపర్ చేయడం లేదా జోక్యం చేసుకోవడం వంటివి చేయవద్దు.
 • చదవలేని వ్యక్తిని లేదా వృద్ధులను వారి ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఒక అభ్యర్థికి లేదా డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయడానికి బలవంతం లేదా మోసగిండం వంటివి చేయవద్దు.
 • మీరు ఒక ఎలక్షన్ అధికారి కానప్పుడు, ఎలక్షన్ అధికారి వలె ప్రవర్తించవద్దు.
 • ఎంప్లాయర్లు తమ ఉద్యోగిని వారి మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటును కార్యాలయానికి తీసుకురావాలని లేదా ఉద్యోగిని కార్యాలయం వద్ద తమ బ్యాలెట్లో ఓటు వేయమని అడగలేరు. జీతం లేదా వేతనాలు చెల్లించే సమయంలో, యజమానులు తమ ఉద్యోగి యొక్క రాజకీయ అభిప్రాయాలు లేదా చర్యలను ప్రభావితం చేసే సామాగ్రీలను జతపరచలేరు.
 • ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రిసింక్ట్ బోర్డు సభ్యులు ప్రయత్నించలేరు లేదా, ఆ సమాచారం తెలిసినట్లయితే, ఓటరు తమ బ్యాలెట్‌లో ఎలా ఓటు వేశారనే విషయాన్ని వారు వెల్లడించలేరు.
 • పైన సంగ్రహించబడిన ఓటింగ్ ప్రక్రియ యొక్క అవినీతికి సంబంధించిన కార్యాచరణపై నిషేధాలు California ఎలక్షన్ నియమావళి 18వ విభాగంలోని 6వ అధ్యాయంలో పేర్కొనబడ్డాయి.

ఈ సమాచారాన్ని pdf ఫార్మాట్‌లో చూడడానికి లేదా డౌన్‌లోడ్ చేసుకోడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నా లేదా ముందస్తు ఓటింగ్ చేయడంలో సహాయం కావాలంటే దయచేసి మా కార్యాలయానికి 1-800-815-2666 వద్ద ఫోన్ చేయండి లేదా voterinfo@rrcc.lacounty.gov ఇమెయిల్ చేయండి.

Icon - Close