అధికారిక వీడియో ప్రత్యక్ష ప్రసారాలు
ఈ వీడియో ప్రజలకు సమాచారం అందించే ఉద్దేశంతో నిజ సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ వీడియోను కౌంటీ రికార్డ్ చేయదు లేదా భద్రపరచదు.
ఓట్ల లెక్కింపు కార్యకలాపాలు
మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్లు మరియు ఓటు కేంద్రాల్లో వేసిన బ్యాలెట్లను కేంద్ర ఓట్ల లెక్కింపు కేంద్రంలో స్కాన్ చేస్తారు. ఎన్నికల రోజున రాత్రి 8:00 గంటలకు అన్ని ఓటు కేంద్రాలు మూసివేసిన తర్వాత మాత్రమే అధికారిక ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన ప్రారంభమవుతాయి.
ఓట్ల లెక్కింపు కెమెరా 1
ఓట్ల లెక్కింపు కెమెరా 2
మెయిల్ ద్వారా ఓటు కార్యకలాపాలు
తిరిగి వచ్చిన ప్రతి మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌పై ఉన్న సంతకం, ఓటరు నమోదు రికార్డుల్లో ఉన్న ఓటరు సంతకంతో సరిపోతుందో లేదో ధృవీకరించడానికి సంతకం ధృవీకరణ పరికరాలను ఉపయోగిస్తారు. ఏదైనా బ్యాలెట్ పాడైపోయినట్లయితే, దానిని పునఃసిద్ధం చేసే విభాగానికి పంపిస్తారు. అక్కడ ఓటరు బ్యాలెట్‌పై ఎక్కడైతే మార్క్ చేశారో, సరిగ్గా అదే విధంగా కొత్త బ్యాలెట్‌ను సిద్ధం చేస్తారు. సంతకం ధృవీకరణ పూర్తయిన మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్లను తిరిగి పంపే కవరు నుండి బయటకు తీసి, పరిశీలించి, ఎన్నికల రోజు రాత్రి ప్రాసెసింగ్ మరియు ఓట్ల లెక్కింపు కోసం సిద్ధం చేస్తారు.
మెయిల్ స్వీకరణ కెమెరా
మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ల సంతకం ధృవీకరణ కెమెరా
మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్లను కవర్ల నుండి బయటకు తీసే ప్రక్రియ కెమెరా
మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్లను పునఃసిద్ధం చేసే ప్రక్రియ కెమెరా
బ్యాలెట్ల స్వీకరణ మరియు తుది ఎన్నికల పరిశీలన
ఓటు కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్లను భద్రంగా స్వీకరించి, నిల్వ చేసే ప్రదేశానికి తరలించి, ఓట్ల లెక్కింపు కోసం సిద్ధం చేస్తారు. అన్ని తాత్కాలిక బ్యాలెట్లు మరియు షరతులతో కూడిన ఓటరు నమోదు ద్వారా వేసిన బ్యాలెట్లను ఓట్ల లెక్కింపు కోసం పంపించే ముందు పరిశీలించి, సిద్ధం చేస్తారు.
బ్యాలెట్ స్వీకరణ
ఓట్ల తుది పరిశీలన మరియు బ్యాలెట్ స్వీకరణ కెమెరా
తుది ఎన్నికల పరిశీలన కార్యకలాపాల కెమెరా