Los Angeles కౌంటీలో మెయిల్ ద్వారా ఓటింగ్
సురక్షితమైన, అందుబాటులో ఉండే మరియు ఇష్టపడే ఓటింగ్ ఎంపిక
Los Angeles కౌంటీలో నమోదైన ఓటర్లందరికీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ పంపబడుతుంది. మెయిల్ ద్వారా మీ ఓటు బ్యాలెట్‌ను తిరిగి పంపించి, మీ ఇంటి నుంచే సురక్షితంగా ఓటు వేయండి.
ఎన్నికల రోజుకు కనీసం 29 రోజుల ముందు, మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ల పంపిణీ ప్రారంభమవుతుంది.
మీ బ్యాలెట్‌ను ఎలా తిరిగి పంపాలి
మీ బ్యాలెట్‌ను తిరిగి పంపడానికి అనేక ఎంపికలు ఉన్నాయి:
మీ బ్యాలెట్ ఎన్నికల రోజునాటికి పోస్ట్‌మార్క్ చేయబడి, ఎన్నికల రోజు తర్వాత 7 రోజులలోపు (EC, § 3020 (b).) మా విభాగానికి అందితే, మేము ఆ బ్యాలెట్‌ను ప్రాసెస్ చేసి, ధృవీకరించి, లెక్కిస్తాము. మీ బ్యాలెట్ సకాలంలో అందేలా చూసుకోవడానికి, ఎన్నికల రోజుకు కనీసం 7 రోజుల ముందు మెయిల్ చేయాలని మేము సూచిస్తున్నాము.
డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ కమ్యూనిటీతో పంచుకోండి: మెయిల్ ద్వారా మీ ఓటు బ్యాలెట్‌ను ఎలా తిరిగి పంపాలి
మీ బ్యాలెట్‌ను ఎలా ట్రాక్ చేయాలి
నా బ్యాలెట్ ఎక్కడ ఉంది (Where's My Ballot) సేవకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ స్థితికి సంబంధించిన పర్సనలైజ్డ్ టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమెయిల్‌లు మరియు/లేదా ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్‌లను పొందండి. ఇది నమోదైన ఓటర్లందరికీ అందుబాటులో ఉండే ఉచిత సేవ. మీ బ్యాలెట్ ఎక్కడ ఉంది మరియు దానిని ఎప్పుడు అందుకుంటారు అనే విషయాలపై ఈ సేవ మీకు తాజా సమాచారాన్ని అందిస్తుంది.
నా బ్యాలెట్ ఎక్కడ ఉంది సేవకు సబ్‌స్క్రైబ్ చేసుకోండి
రీప్లేస్‌మెంట్ బ్యాలెట్‌ను అభ్యర్థించండి
ఈ ఎన్నికల కోసం మీ ప్రస్తుత నివాస చిరునామాకు లేదా తాత్కాలిక చిరునామాకు రీప్లేస్‌మెంట్ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను (Replacement Vote by Mail Ballot) పంపగలము. ఇది ఒకసారి మాత్రమే చేసే అభ్యర్థన మరియు దీనివల్ల మీ ఓటరు నమోదులో శాశ్వత మార్పు ఉండదు. రీప్లేస్‌మెంట్ బ్యాలెట్‌ను అభ్యర్థించడానికి చివరి తేదీ మంగళవారం, అక్టోబర్ 27.
రీప్లేస్‌మెంట్ బ్యాలెట్‌ను అభ్యర్థించండి
మీ బ్యాలెట్ అందిందా మరియు లెక్కించబడిందా అని తనిఖీ చేయండి
ఓటర్లు తమ బ్యాలెట్ అందిందో లేదో మరియు లెక్కించబడిందో లేదో మెయిల్ ద్వారా ఓటు స్టేటస్ టూల్ (Vote by Mail Status Tool) ద్వారా నిర్ధారించుకోవచ్చు.
మెయిల్ ద్వారా ఓటు స్టేటస్ అప్లికేషన్ (Vote by Mail Status Application) ప్రతి రాత్రి అప్‌డేట్ చేయబడుతుంది. మీకు బ్యాలెట్‌ట్రాక్స్ (BallotTrax) నుండి నిర్ధారణ నోటిఫికేషన్ వస్తే, మరుసటి రోజు VBM స్టేటస్ అప్లికేషన్‌లో మీ బ్యాలెట్ స్థితి కనిపిస్తుంది.
మెయిల్ ద్వారా మీ ఓటు బ్యాలెట్‌ను తీసుకోవడానికి మీకు ప్రతినిధి అవసరమా?
మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను తీసుకోవడానికి ప్రతినిధి అవసరమైన ఓటర్లు, ప్రతినిధి రీప్లేస్‌మెంట్ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ అప్లికేషన్ (Representative Replacement Vote by Mail Ballot Application)ను పూర్తి చేసి తిరిగి సమర్పించాలి.
రిజిస్ట్రార్ సిబ్బంది సమక్షంలో ప్రతినిధి స్టేట్‌మెంట్ (దశ 8) పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను ఓటరు ప్రతినిధి స్వయంగా రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లర్క్ కార్యాలయంలో సమర్పించాలి. ఓటరు ప్రతినిధికి అదే రోజున ఓటరుకు సంబంధించిన రీప్లేస్‌మెంట్ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ జారీ చేయబడుతుంది.
పేపర్ అప్లికేషన్‌ను తిరిగి సమర్పించడం
పేపర్ అప్లికేషన్‌లను Los Angeles కౌంటీ రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లర్క్ కార్యాలయానికి తిరిగి సమర్పించండి. మా కార్యాలయం మీ అభ్యర్థనను స్వీకరించి ప్రాసెస్ చేసిన తర్వాత, మీరు అందించిన చిరునామాకు కొత్త మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ జారీ చేయబడుతుంది.
మీకు అనుకూలమైన బ్యాలెట్‌ను తిరిగి పంపే ఎంపికలు ఇక్కడ ఉన్నాయి:
Vote by Mail
Registrar-Recorder/County Clerk
PO Box 60002
City of Industry, CA 91716-0002
వేరొక భాషలో బ్యాలెట్‌ను అభ్యర్థించండి
L.A. కౌంటీ 18 భాషల్లో పూర్తి భాషా సేవలు మరియు/లేదా సహాయాన్ని అందిస్తుంది.
మీ బ్యాలెట్ లేదా ఎన్నికల సామగ్రిని మరొక భాషలో అభ్యర్థించడానికి, దయచేసి మా బహుభాషా సేవల విభాగానికి (213) 374-3861 నంబర్‌కు కాల్ చేయండి.