అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు
అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్, ఓటర్లు తమ వ్యక్తిగత పరికరాలపై తమ బ్యాలెట్‌ను గోప్యంగా మరియు స్వతంత్రంగా యాక్సెస్ చేయడానికి, చదవడానికి, మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
మీ బ్యాలెట్‌ను ఎలా తిరిగి పంపాలి
అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను ఉపయోగించే ఓటర్లు, తమ ప్రింట్ చేసిన బ్యాలెట్‌ను అధికారిక రిటర్న్ ఎన్వలప్‌లో తిరిగి పంపాలి.
మీ బ్యాలెట్‌ను తిరిగి పంపడానికి అనేక ఎంపికలు ఉన్నాయి:
- మెయిల్ ద్వారా పంపండి, ఎలాంటి పోస్టేజీ అవసరం లేదని గుర్తుంచుకోండి
- ఏదైనా మెయిల్ ద్వారా ఓటు డ్రాప్ బాక్స్ లొకేషన్‌లో, స్వయంగా వేయండి
- L.A. కౌంటీలోని ఏదైనా ఓటు కేంద్రంలో సమర్పించండి
మీ బ్యాలెట్ ఎన్నికల రోజున లేదా అంతకు ముందు పోస్ట్‌మార్క్ చేయబడి, 7 రోజుల్లోపు (EC, § 3020(b).) మా విభాగానికి అందితే, మేము ఆ బ్యాలెట్‌ను ప్రాసెస్ చేసి, ధృవీకరించి, లెక్కిస్తాము.
డౌన్‌లోడ్ చేసుకోండి మరియు మీ కమ్యూనిటీతో పంచుకోండి: మెయిల్ ద్వారా మీ ఓటు బ్యాలెట్‌ను ఎలా తిరిగి పంపాలి
మీ వద్ద అధికారిక రిటర్న్ ఎన్వలప్ లేదా?
తమ వద్ద అధికారిక రిటర్న్ ఎన్వలప్ లేని ఓటర్లు ఈ విధంగా చేయవచ్చు:
- బ్యాలెట్ ప్రమాణ పత్రం (Ballot Oath Form) ను ప్రింట్ చేసి, పూర్తి చేసి, మీరు ఓటు వేసిన బ్యాలెట్‌తో పాటు తిరిగి పంపండి
- ప్రింట్ చేసిన బ్యాలెట్ కార్డులతో పాటు బ్యాలెట్ ప్రమాణ పత్రాన్ని మీ స్వంత ఎన్వలప్‌లో చేర్చండి
- బ్యాలెట్ ప్రమాణ పత్రంతో పాటు ఓటు వేసిన బ్యాలెట్‌ను ఈ చిరునామాకు మెయిల్ చేయండి:
County of Los Angeles
Registrar-Recorder/County Clerk
12400 Imperial Highway
ATTN: Vote by Mail Unit
Norwalk, CA 90650
- ఏదైనా అధికారిక బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లో వేయండి
- ఏదైనా ఓటు కేంద్రం లో (ఓటు కేంద్రం తెరిచి ఉన్నప్పుడు) వేయండి
మీ అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను సమీక్షించండి
అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్, ఓటర్లు తమ వ్యక్తిగత పరికరాలపై తమ బ్యాలెట్‌ను గోప్యంగా మరియు స్వతంత్రంగా యాక్సెస్ చేయడానికి, చదవడానికి మరియు ఎంపికలను మార్క్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఓటర్లు తమ ఎంపికలను సమీక్షించిన తర్వాత, బ్యాలెట్‌ను ప్రింట్ చేసి, అధికారిక రిటర్న్ ఎన్వలప్‌లో ఉంచి, మెయిల్ ద్వారా తిరిగి పంపాలి లేదా L.A. కౌంటీలోని ఏదైనా డ్రాప్ బాక్స్‌లో వేయాలి లేదా ఓటు కేంద్రంలో సమర్పించాలి.
ప్రారంభించండి
మీ బ్యాలెట్‌ను ఎలా ట్రాక్ చేయాలి
నా బ్యాలెట్ ఎక్కడ ఉంది (Where's My Ballot) సేవకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా, మీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ స్థితికి సంబంధించిన పర్సనలైజ్డ్ టెక్స్ట్ మెసేజ్‌లు, ఇమెయిల్‌లు మరియు / లేదా ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్‌లను పొందండి. ఇది రిజిస్టర్ చేసుకున్న ఓటర్లందరికీ అందుబాటులో ఉండే ఉచిత సేవ, ఇది మీ బ్యాలెట్ ఎక్కడ ఉంది మరియు మీరు దానిని ఎప్పుడు అందుకోవచ్చనే విషయాలపై తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది.
నా బ్యాలెట్ ఎక్కడ ఉంది సేవకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి
మీ బ్యాలెట్ అందిందా మరియు లెక్కించబడిందా అని ఎలా తనిఖీ చేయాలి
ఓటర్లు తమ బ్యాలెట్ యొక్క స్థితిని తనిఖీ చేసి, అది అందిందా మరియు లెక్కించబడిందా అని మా మెయిల్ ద్వారా ఓటు స్టేటస్ టూల్ (Vote by Mail Status Tool) ద్వారా నిర్ధారించుకోవచ్చు
అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను ఎలా ఉపయోగించాలి మరియు తిరిగి పంపాలి
తరచుగా అడిగే ప్రశ్నలు
- అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు అంటే ఏమిటి? అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు అనేది, ఓటర్లు తమ వ్యక్తిగత పరికరాలపై తమ బ్యాలెట్‌ను గోప్యంగా మరియు స్వతంత్రంగా యాక్సెస్ చేయడానికి, చదవడానికి, ఎంపికలను మార్క్ చేయడానికి వీలు కల్పిస్తూ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను పూర్తి చేసే సౌకర్యాన్ని అందించే ఒక ప్రత్యేక సదుపాయం.
- నా వద్ద నా మెయిల్ ద్వారా ఓటు రిటర్న్ ఎన్వలప్ లేకపోతే ఏమి చేయాలి?
కొత్త మెయిల్ ద్వారా ఓటు ప్యాకెట్‌ను అభ్యర్థించడానికి దయచేసి 213-374-3861 నంబర్‌కు కాల్ చేయండి లేదా votebymail@rrcc.lacounty.gov కు ఇమెయిల్ పంపండి.
- నేను పూర్తి చేసిన అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను ఎలా తిరిగి పంపాలి?
ఎన్నికల రోజున లేదా అంతకు ముందు పోస్ట్ మార్క్ చేయబడేలా మీ బ్యాలెట్‌ను మెయిల్ చేయండి లేదా ఎన్నికల రోజున రాత్రి 8 గంటలలోపు మీ బ్యాలెట్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయండి లేదా ఓటు కేంద్రంలో సమర్పించండి. లొకేషన్ల జాబితా కోసం LAVOTE.GOV ను సందర్శించండి.
- నేను పూర్తి చేసిన అందుబాటులో ఉండే మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను ఎప్పుడు తిరిగి పంపాలి?
బ్యాలెట్లు ఎన్నికల రోజున రాత్రి 8 గంటలలోపు అందాలి లేదా పోస్టుమార్క్ చేయబడాలి.
మమ్మల్ని సంప్రదించండి
మీకు ఏవైనా ప్రశ్నలు ఉన్నాయా? దయచేసి 213-374-3861 నంబర్‌కు కాల్ చేసి మా కార్యాలయాన్ని సంప్రదించండి. మీరు ravbm@rrcc.lacounty.gov కు ఇమెయిల్ పంపడం ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.