బ్యాలెట్ డ్రాప్ బాక్స్
ఓటర్లకు వారి కమ్యూనిటీల అంతటా, అనుకూలమైన మరియు సురక్షితమైన బ్యాలెట్ డ్రాప్ బాక్స్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
మెయిల్ ద్వారా ఓటు డ్రాప్ బాక్స్ కార్యక్రమం
ఓటర్లకు వారి బ్యాలెట్‌ను తిరిగి పంపడానికి ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించే ఒక చొరవగా 2017లో మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ డ్రాప్ బాక్స్ కార్యక్రమం ప్రారంభించబడింది.
బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లు ఓటర్లకు తమ ఓటు వేసిన బ్యాలెట్‌ను తిరిగి పంపడానికి సురక్షితమైన, అందుబాటులో ఉండే మరియు కాంటాక్ట్ ఫ్రీ పద్ధతిని అందిస్తాయి.
మీరు తెలుసుకోవలసినది
- ఎన్నికలకు 29 రోజుల ముందు మరియు ఎన్నికల రోజున ఓటర్లకు డ్రాప్ బాక్సులు అందుబాటులో ఉంటాయి
- ఎన్నికల రోజున డ్రాప్ బాక్సులు రాత్రి 8 గంటలకు మూసివేయబడతాయి
- డ్రాప్ బాక్సులు సిమెంట్‌లో సురక్షితంగా బోల్ట్ చేయబడతాయి లేదా ఆ ప్రదేశంలో గొలుసులతో బంధించబడతాయి
- రాష్ట్ర నిబంధనలలో పేర్కొన్న భద్రతా లక్షణాలతో డ్రాప్ బాక్సులు రూపొందించబడ్డాయి
- శాశ్వత గ్రాఫిటీ లేదా డ్యామేజీని తగ్గించడానికి డ్రాప్ బాక్సులు బాహ్య పూతను కలిగి ఉంటాయి
- ఇద్దరు ఎన్నికల కార్యకర్తలు క్రమం తప్పకుండా బ్యాలెట్లను సేకరిస్తారు
- కౌంటీ అన్ని బాక్సులను పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి చట్ట అమలు సంస్థలు, నగరాలు, స్థానిక వాటాదారులు మరియు కమ్యూనిటీ ఆధారిత సంస్థలతో కలిసి పనిచేస్తుంది
బ్యాలెట్ రిటర్న్ చెక్‌లిస్ట్
మీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్‌ను డ్రాప్ బాక్స్‌లో వేయడానికి ముందు ఈ క్రింది వాటిని నిర్ధారించుకోండి:
- మీరు ఓటు వేసిన బ్యాలెట్ కార్డు(లు) అధికారిక రిటర్న్ ఎన్వలప్ లోపల ఉంచండి
- అధికారిక రిటర్న్ ఎన్వలప్‌ని సురక్షితంగా సీల్ చేయండి.
- అధికారిక రిటర్న్ ఎన్వలప్ వెనక సంతకం చేసి, తేదీ వేయండి.
మీ బ్యాలెట్ అందిందా మరియు లెక్కించబడిందా అని ఎలా తనిఖీ చేయాలి
డ్రాప్ బాక్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా మీరు ఓటు వేసిన బ్యాలెట్‌ను తిరిగి పంపిన తరువాత, అది అందిందా మరియు లెక్కించబడిందా అని నిర్ధారించుకోవడానికి మా ఓట్ బై మెయిల్ స్టేటస్ టూల్ (మెయిల్ ద్వారా ఓటు స్థితి సాధనం) ద్వారా మీ బ్యాలెట్‌ను తనిఖీ చేయవచ్చు.
బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌కు సంబంధించిన సమస్యను రిపోర్ట్ చేయండి
అన్ని ఎన్నికల సమగ్రతను పారదర్శకంగా మరియు అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం. మీకు ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, దానిని వెంటనే రిపోర్ట్ చేయండి!
సమస్యను రిపోర్ట్ చేయండి
ఎన్నికల ప్రచారం నిషేధం!
ఉల్లంఘనలు జరిమానాలు మరియు/లేదా జైలు శిక్షకు దారితీయవచ్చు
ఎక్కడ?
- ఓటు వేయడానికి వరుసలో ఉన్న వ్యక్తి తక్షణ పరిసరాల్లో లేదా పోలింగ్ స్థలం ప్రవేశద్వారం, కర్బ్‌సైడ్ ఓటింగ్ కేంద్రం లేదా డ్రాప్ బాక్స్ నుండి 100 అడుగులలోపు, దిగువ పేర్కొన్న కార్యకలాపాలు నిషేధించబడ్డాయి.
ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి?
- ఏ అభ్యర్థి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని ఎవరినీ కోరవద్దు.
- అభ్యర్థి పేరు, చిత్రం లేదా లోగోను ప్రదర్శించవద్దు.
- బ్యాలెట్ డ్రాప్ బాక్సుల యాక్సెస్‌కు అడ్డుపడటం లేదా వాటి దగ్గర అనవసరంగా తచ్చాడటం చేయవద్దు.
- ఏదైనా పోలింగ్ స్థలం, ఓటు కేంద్రం లేదా బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌కు దగ్గరలో ఏదైనా అభ్యర్థి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎటువంటి మౌఖిక లేదా శబ్దరూప సమాచారాన్ని అందించవద్దు.
- చొరవలు (ఇనిషియేటివ్స్), రిఫరెండంలు, రీకాల్ లేదా అభ్యర్థి నామినేషన్లతో సహా ఎటువంటి పిటిషన్లను సర్క్యులేట్ చేయవద్దు.
- అభ్యర్థి పేరు, చిత్రం, లోగో మరియు/లేదా ఏదైనా అభ్యర్థి లేదా బ్యాలెట్ డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి దుస్తులు (టోపీలు, షర్టులు, గుర్తులు, బటన్లు, స్టిక్కర్లు) పంపిణీ చేయడం, ప్రదర్శించడం లేదా ధరించడం చేయవద్దు.
- ఓటు వేయడానికి ఓటరు అర్హతల సమాచారాన్ని ప్రదర్శించడం లేదా ఓటరుతో మాట్లాడడం చేయవద్దు.
- పైన సంక్షిప్తీకరించిన ఎన్నికల ప్రచార నిషేధాలు California ఎలక్షన్స్ కోడ్‌లోని డివిజన్ 18, అధ్యాయం 4, ఆర్టికల్ 7లో పేర్కొనబడ్డాయి.
ఓటింగ్ ప్రక్రియలో అవినీతి నిషేధించబడింది!
ఉల్లంఘనలు జరిమానాలు మరియు/లేదా జైలు శిక్షకు దారితీయవచ్చు
ఏ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి?
- ఎన్నికల మోసానికి పాల్పడవద్దు లేదా ప్రయత్నించవద్దు.
- ఓటు వేయడానికి లేదా ఓటు వేయకుండా ఉండటానికి ఒక వ్యక్తిని ప్రేరేపించడం లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించడం కోసం ఎలాంటి పరిహారం లేదా లంచం ఇవ్వవద్దు.
- చట్టవిరుద్ధంగా ఓటు వేయవద్దు.
- ఓటు వేయడానికి అర్హత లేనప్పుడు ఓటు వేయడానికి ప్రయత్నించవద్దు లేదా ఓటు వేయడానికి మరొకరికి సహాయం చేయవద్దు.
- ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దు; పోలింగ్ స్థలంలోకి ప్రవేశించే లేదా నిష్క్రమించే ఓటరును ఫోటో తీయడం లేదా రికార్డ్ చేయడం; లేదా ప్రవేశం, నిష్క్రమణ లేదా పార్కింగ్‌కు ఆటంకం కలిగించడం చేయవద్దు.
- ఒక వ్యక్తి యొక్క ఓటు హక్కును సవాలు చేయవద్దు లేదా ఓటర్లను ఓటు వేయకుండా నిరోధించవద్దు; ఓటింగ్ ప్రక్రియను ఆలస్యం చేయడం; లేదా ఏ వ్యక్తికైనా అతను లేదా ఆమె ఓటు వేయడానికి అర్హులు కాదని లేదా ఓటు వేయడానికి రిజిస్టర్ చేసుకోలేదని మోసపూరితంగా సలహా ఇవ్వడం చేయవద్దు.
- ఓటరు తమ బ్యాలెట్‌పై ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు.
- కొన్ని మినహాయింపులతో పోలింగ్ స్థలానికి సమీపంలో తుపాకీని కలిగి ఉండటం లేదా ఎవరైనా కలిగి ఉండేలా ఏర్పాటు చేయడం చేయవద్దు.
- కొన్ని మినహాయింపులతో పోలింగ్ స్థలానికి సమీపంలో శాంతి అధికారి, గార్డు లేదా భద్రతా సిబ్బంది యూనిఫాంలో కనిపించడం లేదా ఎవరైనా అలా కనిపించేలా ఏర్పాటు చేయడం చేయవద్దు.
- ఓటింగ్ వ్యవస్థలోని ఏదైనా భాగాన్ని తారుమారు చేయవద్దు లేదా జోక్యం చేసుకోవద్దు.
- ఎన్నికల ఫలితాలను ఫోర్జరీ చేయవద్దు, నకిలీ చేయవద్దు లేదా వాటిని తారుమారు
చేయవద్దు.
- ఎన్నికల ఫలితాలను మార్చవద్దు.
- ఏదైనా పోలింగ్ జాబితా, అధికారిక బ్యాలెట్ లేదా బ్యాలెట్ కంటైనర్‌ను తారుమారు చేయడం, ధ్వంసం చేయడం లేదా మార్చడం చేయవద్దు.
- అధికారిక సేకరణ పెట్టె అని ఓటరు నమ్మేలా భ్రమింపజేసే ఏదైనా అనధికారిక బ్యాలెట్ సేకరణ కంటైనర్‌ను ప్రదర్శించవద్దు.
- వేసిన ఓట్ల ఫలితాల కాపీని తారుమారు చేయడం లేదా జోక్యం చేసుకోవడం చేయవద్దు.
- చదవలేని వ్యక్తిని లేదా వృద్ధులను, వారి ఉద్దేశ్యానికి విరుద్ధంగా, ఏ అభ్యర్థి లేదా డ్రాఫ్ట్ చట్టానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయమని బలవంతం చేయవద్దు లేదా మోసగించవద్దు.
- మీరు ఎన్నికల అధికారి కానప్పుడు, ఎన్నికల అధికారిగా వ్యవహరించవద్దు.
- యజమానులు తమ ఉద్యోగిని మెయిల్ ద్వారా ఓటు వేసే బ్యాలెట్‌ను పనికి తీసుకురావాలని కోరలేరు లేదా అడగలేరు, లేదా పనిలోనే తమ బ్యాలెట్‌పై ఓటు వేయమని ఉద్యోగులను అడగలేరు. జీతం లేదా వేతనాలు చెల్లించే సమయంలో, యజమానులు తమ ఉద్యోగుల రాజకీయ అభిప్రాయాలు లేదా చర్యలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే ఎటువంటి మెటీరియల్‌ను జతచేయలేరు.
- ప్రిసింక్ట్ బోర్డు సభ్యులు ఓటరు తమ బ్యాలెట్‌పై ఎలా ఓటు వేశారో తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు లేదా, ఆ సమాచారం తెలిసినట్లయితే, దానిని బహిర్గతం చేయకూడదు.
- పైన సంక్షిప్తీకరించిన ఓటింగ్ ప్రక్రియలో అవినీతికి సంబంధించిన కార్యకలాపాలపై నిషేధాలు California ఎలక్షన్స్ కోడ్‌లోని డివిజన్ 18, అధ్యాయం 6లో పేర్కొనబడ్డాయి.
ఈ సమాచారాన్ని పిడిఎఫ్ ఫార్మాట్‌లో చూడటానికి లేదా డౌన్ లోడ్ చేయడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.