విద్యార్థి ఎన్నికల కార్యకర్తల కార్యక్రమం
Los Angeles కౌంటీ విద్యార్థి ఎన్నికల కార్యకర్తల కార్యక్రమం, ఉన్నత పాఠశాల విద్యార్థులకు Los Angeles కౌంటీ ఎన్నికలలో ఎన్నికల కార్యకర్తలుగా సేవలందించే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
పాల్గొనే విద్యార్థులు తమ సేవలకు స్టైపెండ్‌తో పాటు, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా తెలుసుకునే గొప్ప అవకాశాన్ని పొందుతారు.
మీ సేవకు ధన్యవాదాలు
రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లర్క్ Dean C. Logan గారి నుండి ఎన్నికల కార్యకర్తలకు ఒక సందేశం.
అర్హతలు
విద్యార్థి ఎన్నికల కార్యకర్తగా పాల్గొనడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు కింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి:
- ఎన్నికలు జరిగే సమయానికి కనీసం 16 సంవత్సరాల వయస్సు ఉండాలి
- ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండాలి
- యు.ఎస్. పౌరుడై ఉండాలి లేదా యునైటెడ్ స్టేట్స్‌లో చట్టబద్ధమైన శాశ్వత నివాసి (గ్రీన్ కార్డ్ హోల్డర్) అయి ఉండాలి
- మంచి విద్యా ప్రమాణాలు కలిగి ఉండాలి: GPA 2.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి
- ఉపాధ్యాయుడు మరియు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా ఉండాలి
విద్యార్థి ఎన్నికల కార్యకర్తగా దరఖాస్తు చేసుకోండి
మొదట, అర్హత కలిగిన విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రి లేదా సంరక్షకుడు, అలాగే విద్యార్థి ఉపాధ్యాయుడు లేదా కౌన్సిలర్ సంతకాలతో సమ్మతి పత్రాన్ని పూర్తి చేయాలి. సమ్మతి పత్రం కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.
రెండవది, సంతకం చేసిన సమ్మతి పత్రాన్ని ఆన్‌లైన్ దరఖాస్తుకు ((క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా) జతచేయండి.
ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేయండి:
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
విద్యార్థి ఎన్నికల కార్యకర్తల బాధ్యతలు
- శిక్షణకు హాజరు కావాలి
- ఓటు కేంద్రాన్ని ప్రారంభించడంలో మరియు మూసివేయడంలో సహాయం చేయాలి
- రోజంతా ఓటర్లకు సహాయం చేయాలి
విద్యార్థి ఎన్నికల కార్యకర్తగా పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
- ఓటు కేంద్రంలో పనిచేసిన ప్రతి రోజుకు $100 సంపాదించవచ్చు
- ఎన్నికల కార్యకర్తల శిక్షణకు హాజరైనందుకు $80 పొందవచ్చు
- అర్హత కలిగిన భాష మాట్లాడే ద్విభాషా ఎన్నికల కార్యకర్తలకు $100 బోనస్ లభిస్తుంది (క్రింద భాషల జాబితాను చూడండి.)
- కమ్యూనిటీ సేవ/సేవా అభ్యసన క్రెడిట్‌లను పొందవచ్చు
- విద్యార్థి ఎన్నికల కార్యకర్తలు ఎన్నికల విధులు నిర్వహించే రోజున పాఠశాలకు అనుమతితో కూడిన గైర్హాజరు పొందుతారు
- ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది
- కళాశాల ప్రవేశాలు/స్కాలర్‌షిప్ దరఖాస్తులు మరియు రెజ్యూమెలలో ఈ అనుభవం అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది
మీరు కింది భాషలలో ఏవైనా మాట్లాడగలరా? అలా అయితే, విద్యార్థి ఎన్నికల కార్యకర్తగా సేవలందించినందుకు మీరు $100 ద్విభాషా బోనస్ పొందవచ్చు!
- అర్మేనియన్
- బెంగాలీ
- బర్మీస్
- చైనీస్
- ఫార్సీ
- గుజరాతీ
- హిందీ
- హ్మాంగ్
- ఇండోనేషియన్
- జపనీస్
- ఖ్మేర్/కంబోడియన్
- కొరియన్
- లావో
- మంగోలియన్
- నేపాలీ
- పంజాబీ
- రష్యన్
- స్పానిష్
- తగలోగ్/ఫిలిపినో
- తెలుగు
- థాయ్
- ఉర్దూ
- వియత్నామీస్
*$100 ద్విభాషా ఎన్నికల కార్యకర్త స్టైపెండ్ పొందడానికి, మీకు కేటాయించినపనిని పూర్తిగా పూర్తి చేయాలి.
W-2 రిపోర్టింగ్ మరియు IRS పన్నుఅవసరాలు
విద్యార్థి ఎన్నికల కార్యకర్తలకు సంబంధించిన పన్ను రిపోర్టింగ్ సమాచారం
వనరులు
విద్యార్థి ఎన్నికల కార్యకర్తల కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం, (213) 374-3869 నంబర్‌కు ఫోన్ చేయండి లేదా studentelectionworker@rrcc.lacounty.gov కు ఇమెయిల్ పంపండి.
కౌంటీ ఎన్నికల కార్యకర్తల సాఫ్ట్‌వేర్ ఒప్పందం: Konnech, Inc. వారి PollChief సాఫ్ట్‌వేర్.
నేపథ్యం మరియు తరచుగా అడిగే ప్రశ్నలు
L.A. కౌంటీలో విద్యార్థి ఎన్నికల కార్యకర్తగా ఎలా మారాలో తెలుసుకోవడానికి వీడియోను చూడండి.
L.A. కౌంటీ ఎన్నికల వైకల్య సంబంధిత శిక్షణ వీడియోను అమెరికన్ సంకేత భాష (ASL)లో చూడండి.
బహుభాషా ఉపశీర్షికలతో L.A. కౌంటీ ఎన్నికల వైకల్య శిక్షణ వీడియోను చూడండి
(అందుబాటులో ఉన్న అన్ని భాషలను చూడటానికి సెట్టింగ్‌లను పరిశీలించండి).
ఎన్నికల కార్యకర్తల కోసం ఘర్షణలను నివారించే పద్ధతులపై శిక్షణ