నా ఎలక్షన్ సమాచారం కనుగొనండి
ఎలక్షన్ సమీక్ష
- California మంగళవారం, 4 నవంబర్ 2025న రాష్ట్రవ్యాప్త ప్రత్యేక ఎలక్షన్‌ను నిర్వహిస్తోంది.
- California శాసనసభ ఒక రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే చట్టం ద్వారా ఈ ఎలక్షన్‌కు పిలుపునిచ్చింది, తదుపరి గవర్నర్ దానిపై సంతకం చేసి చట్టంగా ఆమోదించారు.
రాష్ట్ర డ్రాఫ్ట్ చట్టం 50
- ఇది ఏమిటి: 2030 వరకు California కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ సరిహద్దులలో తాత్కాలిక మార్పులను అనుమతించే రాజ్యాంగ సవరణ.
- ఓటర్లకు దీని అర్థం ఏమిటి: ఆమోదించబడితే, కొంతమంది ఓటర్లను భవిష్యత్ ఎలక్షన్లలో (2026తో సహా) వేరే యుఎస్ హౌస్ డిస్ట్రిక్టుకు కేటాయించవచ్చు.
- ఇది ఏమి చేయదు: ఇది ఓటరు అర్హత, నమోదు లేదా ఓటింగ్ ఎంపికలను మార్చదు.
ఎలక్షన్ ఫలితాలు
అధికారిక ఓట్ల లెక్కింపు(కాన్వాస్)ను ఖరారు చేయడం
ఎలక్షన్ రాత్రితో బ్యాలెట్లను ప్రాసెస్ చేయడం మరియు లెక్కించడం ముగిసిపోదు. ఎలక్షన్ రాత్రి తరువాత, అనేక మిగిలిన బ్యాలెట్లను అధికారిక ఎలక్షన్ కాన్వాస్‌లో ప్రాసెస్ చేసి లెక్కించాల్సి ఉంటుంది.
30 రోజుల అధికారిక ఎలక్షన్ కాన్వాస్‌లో, ఎలక్షన్ రోజు పోస్టుమార్క్ చేయబడిన మరియు ఏడు (7) రోజుల్లోపు స్వీకరించబడిన అన్ని మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్లు, ఎలక్షన్ రోజున స్వీకరించబడిన షరతులతో కూడిన మరియు తాత్కాలిక బ్యాలెట్లు ప్రాసెస్ చేయబడి ధృవీకరించబడతాయి. ధృవీకరించబడిన తరువాత, అవి లెక్కించబడతాయి. ఎలక్షన్ ఫలితాలు 2 డిసెంబర్ 2025న ధృవీకరించబడాలని షెడ్యూల్ చేయబడింది.
అడవి మంటల ప్రభావానికి గురైన వారికి ఓటరు నమోదు
ఇటీవలి జరిగిన అడవి మంటల కారణంగా మీరు తాత్కాలికంగా స్థానభ్రంశం చెందినట్లయితే, మీరు మీ ఓటరు నమోదును మార్చాల్సిన అవసరం లేదు. మీరు మీ శాశ్వత నివాస (ఇంటి) చిరునామాను కొనసాగించి ఉపయోగించవచ్చు, మరియు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు మీ ఓటింగ్ సామగ్రిని అందుకోవడానికి తాత్కాలిక మెయిలింగ్ చిరునామాను జోడించవచ్చు.
LAVOTE.GOV/RECOVERYలో మరింత తెలుసుకోండి.