Skip to Content

బహుభాషా సేవల కార్యక్రమం

Multilingual Services Program

నేపథ్యం

తప్పనిసరి భాషలు

Los Angeles కౌంటీ 23 భాషలలో ఎన్నికల సమాచారం, సామగ్రి మరియు సహాయాన్ని అందిస్తుంది. మీరు ఓటు వేయడానికి నమోదు చేసుకుంటున్నా, అనువాద బ్యాలెట్‌ను అభ్యర్థిస్తున్నా లేదా ఓటు కేంద్రంలో సహాయం కోసం చూస్తున్నా, ప్రతి దశలోనూ మీకు మద్దతు ఇవ్వడానికి మా వద్ద వనరులు అందుబాటులో ఉన్నాయి. 

1975లో, భాషా మైనారిటీ సమూహాలు అర్థవంతంగా ఓటు వేయగలిగేలా సహాయం పొందాలనే నిబంధనను సృష్టించడానికి 1965 ఓటింగ్ హక్కుల చట్టం (VRA) సవరించబడింది. ఒక కౌంటీ నిర్దిష్ట సంఖ్యా పరిమితిని చేరుకునే భాషా మైనారిటీ సమూహాలకు మౌఖిక భాషా సహాయం మరియు అనువదించబడిన వ్రాతపూర్వక ఎన్నికల సామగ్రిని అందించాలి. 1982 మరియు 1992లో ఆమోదించబడిన ఓటింగ్ హక్కుల చట్టానికి సవరణల ఆధారంగా, ఒక మైనారిటీ భాష ఈ క్రింది సందర్భాలలో అనువదించబడుతుంది: (1) ఓటింగ్ వయస్సు గల పౌరులలో 5% కంటే ఎక్కువ మంది ఒకే భాషా మైనారిటీకి చెందినవారై మరియు వారి ఆంగ్ల ప్రావీణ్యం పరిమితంగా ఉన్నప్పుడు లేదా (2) ఓటింగ్ వయస్సు గల పౌరులలో 10,000 కంటే ఎక్కువ మంది ఒకే భాషా మైనారిటీకి చెందినవారై మరియు వారి ఆంగ్ల ప్రావీణ్యం పరిమితంగా ఉన్నప్పుడు.  

VRA పరిమితికి అనుగుణంగా లేని అదనపు భాషలలో అనువదించబడిన “ఫ్యాసిమైల్ బ్యాలెట్‌లను” అందించడానికి California చట్టాలు కౌంటీలకు అదనపు అవసరాలను జోడిస్తాయి. ఇంగ్లీష్ బ్యాలెట్‌పై గుర్తు పెట్టేటప్పుడు సూచన కోసం దాని పక్కన ఉంచుకుని చూసుకోవడానికి వీలుగా, అనువదించిన సమాచారంతో ఈ “ఫ్యాసిమైల్ బ్యాలెట్‌లు” రూపొందించబడ్డాయి. ఓటర్లు నేరుగా గుర్తు పెట్టగల (ఓటు వేయగల) అనువాద బ్యాలెట్‌లను అందించడం ద్వారా Los Angeles కౌంటీ California రాష్ట్ర అవసరాలకు మించి ముందుకు సాగుతుంది.   

మేము మద్దతు ఇచ్చే భాషలు

Los Angeles కౌంటీ ప్రస్తుతం మా హాట్‌లైన్‌ల ద్వారా మరియు ఓటింగ్ కేంద్రాలలో ఇంగ్లీష్ మరియు ఈ కింది భాషలలో ఎన్నికల సామగ్రిని మరియు మౌఖిక సహాయాన్ని అందిస్తుంది: 

అర్మేనియన్ | బెంగాలీ | బర్మీస్ | చైనీస్ | కంబోడియన్/ఖ్మేర్ | ఫార్సీ | ఫిలిపినో/తగలోగ్ | గుజరాతీ | హిందీ | ఇండోనేషియన్ | జపనీస్ | కొరియన్ | మంగోలియన్ | రష్యన్ | స్పానిష్ | తెలుగు | థాయ్ | వియత్నామీస్

నిర్దేశిత ఓటింగ్ కేంద్రాలలో ఫోన్ మరియు వ్యక్తిగత సహాయం హ్మోంగ్, లావోషియన్, నేపాలీ, పంజాబీ మరియు ఉర్దూ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. 

సహాయం ఎలా పొందాలి

మా భాషా సహాయ హాట్‌లైన్‌కు కాల్ చేయండి

Telugu/తెలుగు: 213-374-3861

సాధారణ భాషా సహాయ హాట్‌లైన్‌ (800) 815-2666 నంబర్‌కు కాల్ చేసి ఆప్షన్ 3ను ఎంచుకోండి లేదా నేరుగా సంప్రదించడానికి మీ భాషా సహాయ లైన్‌కు కాల్ చేయండి: 

మీకు ఏవైనా ప్రశ్నలున్నాయా? మీరు కాల్ చేసి, 23 భాషలలో ఏదైనా ఒక భాషలో ఎన్నికల సహాయం పొందవచ్చు.

భాష నేరుగా సంప్రదించుటకు నంబరు 
 Armenian/ՀԱՅԵՐԵՆ   213-358-2712
 Bengali/ বাংলা  213-374-3652
 Burmese/ မြန်မာစာ  213-374-3655
 Chinese Cantonese/廣東話  213-358-2713
 Chinese Mandarin/國語  213-358-2714
 Farsi/ فارسی  213-358-2721
 Filipino/Tagalog  213-358-2701
 Gujarati/ ગુજરાતી  213-374-3667
 Hindi/ हिन्दी  213-358-2732
 * Hmong/Hmoob  213-262-3605
 Indonesian/Bahasa  213-374-3694
 Japanese /日本語  213-358-2733
 Khmer/Cambodian /ខ្មែរ/កម្ពុជា  213-358-2734
 Korean/한국어  213-358-2738
 * Lao/ ລາວ  213-262-1637
 Mongolian/Монгол  213-374-3767
 * Nepali/ नेपाली  213-257-8829
 * Punjabi/ ਪੰਜਾਬੀ  213-246-3404
 Russian/Русский  213-358-2765
 Spanish/Español  213-358-2770
 Telugu/తెలుగు  213-374-3861
 Thai/ภาษาไทย  213-358-2202
 * Urdu/ اردو  213-246-4696
 Vietnamese/Tiếng Việt  213-358-2206

*ఇవి LA కౌంటీ ప్రస్తుతం మౌఖిక సహాయాన్ని అందిస్తున్న కొత్తగా జోడించబడిన భాషలు

భాషా సహాయం అవసరమైన ఓటర్లకు సేవలను అందించడానికి Los Angeles కౌంటీ చే బహుభాషా ఓటరు సేవల కార్యక్రమం స్థాపించబడింది. ఓటరు ధోరణులను విశ్లేషించడం, సాంకేతిక మెరుగుదలలు చేయడం, మరియు ఓటర్లు మరియు మా కమ్యూనిటీ ఔట్రీచ్ భాగస్వాముల అభిప్రాయాన్ని వినడం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని మరియు అందిస్తున్న సేవలను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉన్నాము. ఈ క్రింది సేవలు అందించబడుతున్నాయి: 

అనువదించబడిన ఎన్నికల సామగ్రిని అభ్యర్థించండి.

మీరు ఎన్నికల సహాయాన్ని 18 భాషలలో ఏదైనా ఒక భాషలో అభ్యర్థించవచ్చు: అర్మేనియన్, బెంగాలీ, బర్మీస్, చైనీస్, కంబోడియన్/ఖ్మేర్, ఫార్సీ, ఫిలిపినో/తగలోగ్, గుజరాతీ, హిందీ, ఇండోనేషియన్, జపనీస్, కొరియన్, మంగోలియన్, రష్యన్, స్పానిష్, తెలుగు, థాయ్, వియత్నామీస్.

మీరు కొత్త ఓటరా? మీరు ఇంకా ఓటు వేయడానికి నమోదు చేసుకోకపోతే, కొత్త ఓటరు నమోదు ఫారమ్‌ను పూరించి సమర్పించండి. మీరు ఇక్కడ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు ఇప్పటికే ఓటు వేయడానికి నమోదు చేసుకున్నట్లయితే, మీరు ఈ మార్గాలలో ఒకదానిలో భాషా ప్రాధాన్యతలో మార్పును అభ్యర్థించవచ్చు

మీరు మీ భాషా ప్రాధాన్యతను ఒక్కసారి ఎంచుకున్న తర్వాత, ప్రతి భవిష్యత్తు ఎన్నికలలోనూ మీకు స్వయంచాలకంగా అనువదించబడిన సామాగ్రి అందుతుంది. ఇందులో మీ మెయిల్ ద్వారా ఓటు బ్యాలెట్ మరియు శాంపిల్ బ్యాలెట్ బుక్‌లెట్ కూడా ఉంటాయి. ఈ బుక్‌లెట్‌లో మీరు ఓటు వేయగల రోజులు మరియు మార్గాల గురించిన సమాచారం, అభ్యర్థుల పోటీల జాబితాతో కూడిన శాంపిల్ బ్యాలెట్, మరియు డ్రాఫ్ట్ చట్టాల వివరాలు ఉంటాయి. 

ఓటు కేంద్రాలలో ద్విభాషా సహాయం

మీరు Los Angeles కౌంటీలోని ఏదైనా ఓటు కేంద్రంలో ఓటు వేయవచ్చు మరియు మీ భాషలో సహాయం కోరవచ్చు.

  • ఓటింగ్ కేంద్రాలలో బ్యాలెట్ మార్కింగ్ పరికరాలు మీ బ్యాలెట్‌ను 18 భాషలలో వీక్షించడానికి మరియు వినడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి
  • కమ్యూనిటీ భాషా అవసరాల ఆధారంగా ఓటింగ్ కేంద్రాలకు కేటాయించిన ద్విభాషా ఎలక్షన్ కార్యకర్తలు సహాయం చేయడానికి అందుబాటులో ఉండవచ్చు.

ఓటింగ్ కేంద్రాలు మరియు వ్యక్తిగత ఓటింగ్ ఎంపికల గురించి మరింత తెలుసుకోండి. 

మీ బ్యాలెట్‌ను ఆన్‌లైన్‌లో చూడండి

నమోదు చేసుకున్న ఓటర్లు ఎన్నికల రోజుకు ముందు వారి బ్యాలెట్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. మీ ఫోన్‌లో మీ ఎంపికలను ముందుగా సమీక్షించడానికి ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్‌ను ఉపయోగించండి – ఆపై మీ ఎంపికలను ఓటు కేంద్రానికి తీసుకురండి.

ఇంటరాక్టివ్ శాంపిల్ బ్యాలెట్ గురించి మరింత తెలుసుకోండి

ఇతరులకు ఓటు వేయడానికి సహాయం చేయాలనుకుంటున్నారా?

మీరు ఇంగ్లీష్‌తో పాటు మరియు మేము సేవలు అందించే 23 భాషలలో ఏదైనా ఒక భాష మాట్లాడగలిగితే, దయచేసి ఎలక్షన్ కార్యకర్తగా దరఖాస్తు చేసుకోవడాన్ని పరిగణించండి. ఇది మీ కమ్యూనిటీకి సేవ చేయడానికి ఒక అర్ధవంతమైన మార్గం.

ఎలక్షన్ కార్యకర్త గా దరఖాస్తు చేసుకోవడం గురించి మరింత తెలుసుకోండి.

అదనపు వనరులు

విభాగీయ భాషా ప్రాప్యత ప్రణాళిక

రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లోర్క్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్ ద్వారా ఏర్పాటు చేయబడిన కౌంటీ-వైడ్ లాంగ్వేజ్ యాక్సెస్ పాలసీకి అనుగుణంగా, విభాగీయ భాషా ప్రాప్యత ప్రణాళిక: ఎన్నికల కార్యక్రమాలు అనే పత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రణాళిక ఎన్నికల కార్యక్రమాలకు భాషా ప్రాప్యత పట్ల డిపార్ట్‌మెంట్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అడ్డంకులను తగ్గించడం, ప్రాప్యతను పెంచడం మరియు స్వతంత్ర ఓటింగ్ అనుభవాన్ని కల్పించడం ద్వారా మేము ఈ నిబద్ధతను అమలు చేస్తాము.

ఎన్నికల సామగ్రి

Icon - Close