Skip to Content

తాత్కాలిక ఓటింగ్

provisional-voting

1984 నుండి Californiaలో తాత్కాలిక ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటింగ్) విధానం ఉపయోగంలో ఉంది. ఓటు వేసిన తర్వాత, తాత్కాలిక బ్యాలెట్‌ను గులాబీ రంగు కవరులో ఉంచి, ప్రాసెసింగ్ కోసం భద్రపరుస్తారు. ఓటరు నమోదు (రిజిస్ట్రేషన్) యొక్క చెల్లుబాటును మరియు ఆ ఓటరు ఈ ఎన్నికల్లో అప్పటికే ఓటు వేయలేదనే విషయాన్ని ఎన్నికల అధికారులు ధృవీకరించిన తర్వాతే ఈ తాత్కాలిక బ్యాలెట్లను లెక్కిస్తారు.

గత ఎన్నికల రికార్డుల ప్రకారం సగటున 85-90% తాత్కాలిక బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని మరియు లెక్కించబడతాయని తెలుస్తోంది.

ఓటర్లు ఎన్నికలు జరిగిన 30 రోజుల తర్వాత తమ తాత్కాలిక బ్యాలెట్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు

తాత్కాలిక బ్యాలెట్ వేసే ప్రతి ఓటరుకు తమ బ్యాలెట్ లెక్కించబడిందో లేదో తెలుసుకునే హక్కు ఉంది, ఒకవేళ లెక్కించకపోతే, అది ఎందుకు లెక్కించబడలేదో దానికి గల కారణాన్ని తెలుసుకునే హక్కు కూడా ఉంది.

  • ఓటర్లు ఎన్నికలు జరిగిన 30 రోజుల తర్వాత ప్రొవిజనల్ బ్యాలెట్ స్టేటస్ (Provisional Ballot Status) లుక్ అప్ టూల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ బ్యాలెట్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. తమ బ్యాలెట్ స్థితిని తెలుసుకోవడానికి కింది వివరాలు అవసరం:
    • మీ ఇంటి పేరు
    • మీ పుట్టిన తేదీ
    • మీ ఇంటి నెంబరు (కేవలం మీ ఇంటి నెంబరు, వీధి పేరు అవసరం లేదు)
  • కంప్యూటర్ సౌకర్యం లేని ఓటర్లు (213) 374-3861 నంబర్‌కు కాల్ చేయవచ్చు.

తాత్కాలిక ఓటింగ్ ఎప్పుడు అవసరం?

  • ఓటరు ఇప్పటికే వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా ఓటు వేశారని (VOTED) ఇ-పోల్‌బుక్ పేర్కొంటే
  • ఓటరు నిష్క్రియంగా ఉన్నారని (INACTIVE) మరియు వారు ఓటరు ప్రమాణ పత్రంపై సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారని ఇ-పోల్‌బుక్ పేర్కొంటే
  • ఓటరు కౌంటీ వెలుపలి వ్యక్తి (OUT OF COUNTY) అని ఇ-పోల్‌బుక్ పేర్కొంటే
  • ఓటరు కొత్తవారని (NEW) మరియు ID ని అందించలేదని ఇ-పోల్‌బుక్ పేర్కొంటే

తాత్కాలిక ఓటింగ్ ఎందుకు?

  • క్లరికల్, ప్రాసెసింగ్, కంప్యూటర్ లేదా ఇతర లోపం కారణంగా ఓటరు పేరు ఇ-పోల్‌బుక్‌లో లేనట్లయితే, సరిగ్గా నమోదు చేసుకున్న ఏ ఓటరుకు కూడా ఓటు వేసే హక్కు నిరాకరించబడదని తాత్కాలిక ఓటింగ్ నిర్ధారిస్తుంది.
  • ఏ ఓటరు కూడా పొరపాటున ఒకే ఎన్నికల్లో రెండుసార్లు ఓటు వేయలేదని ధృవీకరించడానికి ఈ తాత్కాలిక ఓటింగ్ విధానం రిజిస్ట్రార్-రికార్డర్/కౌంటీ క్లర్క్‌కు వీలు కల్పిస్తుంది.
  • ఒక ఓటరు తాము ఓటు వేయడానికి నమోదు చేసుకున్న కౌంటీలోని ఏ ఓటు కేంద్రంలోనైనా తాత్కాలిక బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చు, అయితే, ఆ ఓటరు ఏ ఎన్నికల స్థానాలకు ఓటు వేయడానికి అర్హులో, అవి మాత్రమే లెక్కించబడతాయి.

మా తాత్కాలిక ఓటింగ్ సమాచార పేజీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియు ప్రింట్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, సందేహం ఉన్నప్పుడు, తాత్కాలికంగా (ప్రొవిజనల్ పద్ధతిలో) ఓటు వేయండి. పోలింగ్ స్థలంలో మీరు ఎదుర్కొనే ఏవైనా సమస్యలతో సంబంధం లేకుండా తాత్కాలిక బ్యాలెట్ వేయడం ఓటరుగా మీ హక్కు. ఓటింగ్ ఎప్పటికీ ఆగదు, మరియు తాత్కాలిక బ్యాలెట్ అనేది ఎన్నికల రోజున ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం లభించేలా చూడటానికి ఒక మార్గం.

Icon - Close